.jpg)
ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న సినిమా ఆదిపురుష్ రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రూ.550 కోట్ల బారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తీయడం, దీనిపై అనేక విమర్శలు వచ్చినందున ఈ సినిమా సూపర్ హిట్ అవడం దర్శకనిర్మాతలకు చాలా అవసరం.
పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ తొలిసారిగా పౌరాణిక సినిమాలో అదీ... శ్రీరాముడుగా నటించాడు కనుక ఈ సినిమా హిట్ అవడం ఆయనకు చాలా అవసరం.
ఈ సినిమా విడుదలైతే దూది ఏకిన్నట్లు ఏకుదామని ఆతృతగా ఎదురుచూస్తున్న సినీ విశ్లేషకులు ఓవైపు, ఈ నేపధ్యంలో సినిమా ఎలా ఉంటుందో అనే ఆందోళనతో ఎదురుచూస్తున్న అభిమానులు మరోవైపు సిద్దంగా ఉన్నారు. కనుక మరికొన్ని గంటలలో ఈ యుద్ధంలో ఆదిపురుష్ గెలుస్తాడో లేదో తేలిపోతుంది.
ఇక ఆంద్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1600 థియేటర్లు ఉండగా వాటిలో 1100 ధియేటర్లలో ఆదిపురుష్ సినిమా రేపు విడుదల కాబోతోంది. మన దేశంలో మొత్తం 3,300 థియేటర్లలో ఆదిపురుష్ విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 7,000 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఆదిపురుష్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించారు.
భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మించారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేశారు.