త్వరలో దృశ్యం-3... మళ్ళీ ఆయనే దర్శకుడు

మలయాళ దర్శకుడు జీతూ జోసఫ్ చూపించిన దృశ్యం-1, 2 సినిమాలను యావత్ దేశ ప్రజలు ఎంతగానో ఆదరించారు. తెలుగులో వెంకటేష్,మీనా నటించగా, తమిళంలో కమల్‌హాసన్‌, హిందీలో అజయ్ దేవగన్ చేశారు. ఆ సినిమాను ఏ భాషలో రీమేక్ చేస్తే ఆ భాషలో సూపర్ హిట్ అయ్యింది. కనుక ఇప్పుడు దృశ్యం-3 సినిమాని జీతూ జోసెఫ్ సిద్దం చేస్తున్నారు. 

ఈసారి మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించబోతున్నారు. మలయాళంలో మోహన్ లాల్, హిందీలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బహుశః వచ్చే ఏడాది జనవరి నెలాఖరులోగా దృశ్యం-3 రెగ్యులర్ షూటింగ్‌ మొదలు పెట్టవచ్చని తెలుస్తోంది. తెలుగులో మళ్ళీ వెంకటేష్, మీనాలే చేసే అవకాశం ఉంది. ఒకవేళ జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెడితే పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు 4-5 నెలలు పడుతుంది కనుక వచ్చే వేసవిలో దృశ్యం-3 విడుదలయ్యే అవకాశం ఉంది.