
విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా తన ఇమేజ్‌కు తగ్గ సినిమాలు చేస్తుంటే, అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ పక్కింటి అబ్బాయిగా మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చక్కటి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రతీ సినిమాకు మద్య కొంత ఎక్కువ గ్యాప్‌లో తీసుకొంటున్నప్పటికీ చక్కటి సినిమాలతో వస్తున్నాడు. ఈసారి సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో అతనికి జోడీగా వైష్ణవీ చైతన్య నటించింది. విరాజ్ అశ్విన్, సీత, నాగబాబు, పృధ్వీ, లిరిష, సాత్విక్ ఆనంద్, కుసుమ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సాయి రాజేష్ నీలం, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, కొరియోగ్రఫీ: పోలాకి విజయ్ చేశారు.
ఈ సినిమాను ఎస్కెఎన్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై శ్రీనివాస్ కుమార్ నిర్మిస్తున్నారు. జూలై రెండో వారంలో బేబీతో కలిసి ఆనంద్ దేవరకొండ వస్తున్నాడు.