మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో చాలా సినిమాలలో నటించింది కానీ ఆమెకు ఎవరితోనూ అఫైర్స్ ఉన్నట్లు పెద్దగా వార్తలు రాలేదు కానీ గత కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌కు చెందిన నటుడు విజయ్ వర్మతో పార్టీలలో, పబ్బులలో కనిపిస్తుండటంతో వారిద్దరి మద్య లవ్ అఫైర్ సాగుతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలలో వారిద్దరూ అందరి ఎదురుగా లిప్-లాక్ కిస్ చేసుకోవడంతో వారి మద్య రిలేషన్ ఉందని స్పష్టమైంది.
ఇటీవల తమన్నా ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విలేఖరులు విజయ్ వర్మతో సంబంధం గురించి తమన్నాను ప్రశ్నించగా, “అవును మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకొంటున్నాము. రిలేషన్‌లో ఉన్నాము. సాధారణంగా ఆడపిల్లలు కాబోయేవాడు తమతో ఏవిదంగా ఉండాలని కోరుకొంటారో విజయ్ వర్మ అలాగే నాతో ఉంటాడు. నన్ను చాలా బాగా చూసుకొంటాడు. అతనితో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ప్రస్తుతానికి మా ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలే అయినప్పటికీ ఏదో ఓరోజు మేము ఏకం అవుతాము. అప్పుడు మా ఇద్దరి ప్రపంచం ఒకటే అవుతుంది,” అని జవాబు చెప్పింది.
విజయ్ వర్మ సినిమాల విషయానికి వస్తే, హిందీలో రణవీర్ సింగ్, ఆలియా భట్ జంటగా వచ్చిన ‘గల్లీ బాయ్’, నాని హీరోగా మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్‌గా, ఆలియా భట్‌తో కలిసి చేసిన డార్లింగ్స్, తాజాగా సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో తమన్నాతోనే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు.