.jpg)
భారీ బడ్జెట్‌తో తీసిన ఆదిపురుష్ భారీ అంచనాల మద్య మరో మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణగాధ ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతులవారు వస్తారనే హిందువుల నమ్మకాన్ని గౌరవిస్తూ ఈ సినిమా ప్రదర్శించబడే అన్ని థియేటర్లలో ఆయన కోసం ఓ సీటుని విడిచిపెట్టాలని నిర్మాతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే హనుమంతుడి పక్కన కూర్చొని సినిమా చూడండి అంటూ పక్క సీట్లను ఎక్కువ ధరకు అమ్ముకొనేందుకే నిర్మాతలు ఇలా చేస్తున్నారాన్ని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిపై నిర్మాతలు ఆ పుకార్లను ఖండించారు.
థియేటర్లలో మిగిలిన సీట్లకు ఎంత టికెట్ ఛార్జ్ ఉంటుందో హనుమతుడి పక్క సీట్లకు కూడా అంతే ఉంటుందని తెలిపారు. తాము కేవలం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నామే తప్ప వ్యాపారకోణంలో ఆలోచించి కాదని చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2.59 నిమిషాలు. అంటే మూడు గంటలన్న మాట!