
విలక్షణమైన కధాంశాలను ఎంచుకొని పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన యువనటుడు నిఖిల్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘స్పై’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదలపై నిఖిల్‌కు, నిర్మాతకు మద్య విభేధాలు ఏర్పడిన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకొని ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా స్పై సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రత్యంజీర సినిమాస్ ట్విట్టర్‌లో ప్రకటించింది.
ప్రముఖ సినీ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్‌లో పెద్ద హీరోలు తమ ఇమేజ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి వాటినే పాన్ ఇండియా మూవీలుగా విడుదల చేసి బోర్లాపడుతుంటే, నిఖిల్ మాత్రం యావత్ దేశప్రజలు కనెక్ట్ అయ్యే కధాంశాలను తీసుకొని వరుస హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు తీసిన ఈ ‘స్పై’ సినిమా నేతాజీ సుభాస్ చంద్రబోస్ మృతిపై విచారణ జరిపే గూఢచారి కధ. పైగా దీనిలో మంచి యాక్షన్ సీన్స్ కూడా జోడించాడు. కనుక ఈ సినిమాతో కూడా దేశ ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు కనుక సినిమా బాగా తీసి ఉంటే నిఖిల్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడుతుంది. పాన్ ఇండియా స్టార్‌గా మరో మెట్టు ఎక్కుతాడు.
ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా సాన్యా ఠాకూర్, ఐశ్వర్య మేనన్ నటించారు. ఐశ్వర్య రాజేష్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంగీతం శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ అందించారు.