రవితేజ సినిమా టైటిల్‌: ఈగల్

మాస్ మహారాజ రవితేజ, అనుపమా పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌ ‘ఈగల్’ అని ఖరారు చేశారు. ఈ విషయం తెలియజేస్తూ చిన్న టీజర్‌ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో కావ్యా థాపర్, మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఓ సాధారణ రైతు ఎందుకు పోరాటయోధుడుగా మారాల్సి వచ్చిందనేది కధాంశంగా కనిపిస్తోంది.

ఒక మనిషికి ఇన్ని అవతారాలేమిటి... అతని చుట్టూ ఇన్ని కధలేమిటి? అంటూ హీరోయిన్‌ ప్రశ్న హీరో అసాధారణ వ్యక్తి అని అతనిని పట్టుకోవడం కోసం రా టీం గాలిస్తున్నట్లు టీజర్‌లో చూపారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడుగా మారుతున్నారు. కనుక ఫస్ట్-లుక్‌ పోస్టర్‌ ఆయన ఆలోచనలను ప్రతిభింభిస్తున్నట్లే ఉంది. “కొంతమంది చూపు... మనిషి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు...” ఆ చూపే మరణం.... ఆ అడుగే సమరం...” వంటి డైలాగ్స్ రవితేజకు బాగా సూట్ అయ్యేవే. 

ఈ సినిమాకు కధ, ఎడిటింగ్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని, పాటలు: చైతన్య ప్రసాద్, రెహ్మాన్, కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం: దావ్జాండ్, డైలాగ్స్: మణిబాబు, స్టంట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ మరియు టోమెక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి. విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.