
కెరియర్ ఫుల్ క్రేజ్ లో నడుస్తున్న సమయంలో కోలీవుడ్ హాట్ బ్యూటీ హన్సిక అక్కడ హీరో శింభుతో ప్రేమలో పడింది. అప్పటికే నయనతారతో ప్రేమ వ్యవహారం నడిపించిన శింభు ఆమెను వదిలించుకుని హాన్సికతో ప్రేమ పాటలు పాడాడు. మరి ఇద్దరు పెళ్లి చేసుకోవడమే అన్న ఊపు చేసి మళ్లీ ఎవరిదారి వారు చూసుకున్నారు. అసలు విషయం ఏంటి అని ఇప్పటిదాకా తెలియలేదు. ఆ కసితో వరుస సినిమాలతో హాన్సిక అక్కడ స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ దక్కించుకుంది.
అయితే ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే హాన్సిక మాత్రం ఆ అనుభూతి తనకు బాధనే మిగిల్చింది అంటుంది. అందుకే ఈసారి ప్రేమలో పడే అవకాశమే లేదంటూ గట్టిగా చెబుతుంది. ప్రస్తుతం కెరియర్ మీదే పూర్తి దృష్టి పెడుతున్నట్టు చెప్పిన హాన్సిక పెద్దలు కుదిర్చిన పెళ్లినే తాను చేసుకుంటా అని అంటుంది. మొత్తానికి నయనతార అయినా శింభు ప్రేమ తర్వాత మళ్లీ ఇద్దరి ముగ్గురిని మార్చింది కాని హాన్సిక మాత్రం అతనితోనే తన జీవితంలో ప్రేమ అనే ఫీలింగ్ కు ఎండ్ కార్డ్ వేసేసింది.
ఎంత కాదన్న ఆమె అలా ఫిక్స్ అయ్యేలా చేసింది మాత్రం శింభునే.. ఇక తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న హాన్సిక త్వరలో తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.