
మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’తో హిట్ కొట్టాడు కానీ తర్వాత చేసిన ‘రావణాసుర’ ఫ్లాప్ అవడం చాలా నిరాశ కలిగించింది. కనుక దసరాకు సిద్దం చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మీద ఆశలు పెట్టుకొన్నాడు. అది రిలీజ్ అయ్యేలోగా రవితేజ మరో సినిమా మొదలుపెట్టేశాడు.
రవితేజకు ఇది 73వ సినిమా. కనుక ఆర్‌టి73 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఈరోజు సాయం విడుదల చేస్తూ సాయంత్రం 6.03 గంటలకు టైటిల్ వీడియోని విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్యా ధాపర్ నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ జాన్‌విక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.