ఖమ్మంలో రామాలయాలకు ఉచితంగా ఆదిపురుష్‌ టికెట్లు!

ఆదిపురుష్‌ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించడం, ప్రభాస్‌ తొలిసారిగా శ్రీరాముడి పాత్రలో పౌరాణిక సినిమాలో నటించినందున దీనిపై చాలా భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో పాత్రల వేషధారణ, టీజర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రైలర్‌తో వాటన్నిటికీ గట్టి సమాధానం చెప్పినప్పటికీ, త్తిన్నందున ఈ సినిమాపై  ఎలా ఉంటుందో అనే అనుమానాలు, భయాలు ఇంకా నెలకొనే ఉన్నాయి.

ఈ నేపద్యంలో ఈ సినీ బృందం భక్తి, వితరణ పేరుతో ప్రజలలో సెంటిమెంట్ రగిలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా ప్రదర్శించబడే ప్రతీ థియేటరులో హనుమంతుడికి ఒక సీటు విడిచిపెట్టడం, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పదివేల టికెట్లు ఉచితంగా పంపిణీ చేయడం ఓ విదంగా సినిమా ప్రమోషన్స్‌ అనే భావించవచ్చు.

తాజాగా శ్రేయస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్ రావు కూడా ఖమ్మం జిల్లాలోని ఒక్కొక్క రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా అందజేథ్శామని ప్రకటించారు. ఆదిపురుష్‌ ఉచిత టికెట్స్ కావాలనుకొనేవారు సోషల్ మీడియా ద్వారా తమను సంప్రదించాలని కోరారు. 

ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించారు. రామాయణంలో అరణ్యకాండ నుంచి యుద్ధకాండ (రావణ సంహారం) వరకు కధాంశంగా తీసుకొని ఈ సినిమాను తీసిన్నట్లు టీజర్‌, ట్రైలర్‌ ద్వారా స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించారు.  

భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మించారు.