.jpg)
ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న‘భగవత్ కేసరి’ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. టీజర్లో బాలయ్య మార్కు పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు చివరిగా సరదా సన్నివేశం కూడా చూపారు.
బాలయ్య వాయిస్ ఓవర్‌తో “రాజు ఆని ఎనుకనఉన్న వందలమంది మందను సూపిస్తాడు... మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుణం సిపిస్తాడు...” అనే డైలాగ్, “అడివి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి... ఈ పేరు సానాయేళ్ళు యాదుంటది” అనే డైలాగ్స్,తో పాటు బాలయ్య హిందీలో కూడా “పతాహై బేజా కానోంకి బీచ్ క్యో రెహతా హై... జబ్ కాన్ బెహరీ పడ్తీ హై జబ్ బాత్ బేజామే గుస్తీహై...” అంటూ ఓ డైలాగ్ చెప్పారు. ఈసారి బాలయ్య “పతాహై బేజా కానోంకి బీచ్ క్యో రెహతా హై... జబ్ కాన్ బెహరీ పడ్తీ హై జబ్ బాత్ బేజామే గుస్తీహై...” అంటూ హిందీలో కూడా ఓ డైలాగ్ చెప్పారు. ఈ సినిమాలో నెరిసిన గడ్డంతో బాలయ్య వయసుకు తగ్గ పాత్ర చేస్తున్నప్పటికీ, బాలయ్య మార్క్ యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ కరువు ఉండదని టీజర్ మరోసారి స్పష్టం చేసింది.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్, వారి కుమార్తెగా శ్రీలీల నటిస్తున్నారు. తెలంగాణ నేపద్యంలో తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు ధమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. ఈ ఏడాది దసరా పండుగకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.