1.jpg)
ఆదిపురుష్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా నిడివి 2.59 గంటలు. అంటే దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులను మూడు గంటలసేపు థియేటర్లలో కూర్చోబెట్టాలన్న మాట! ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్స్, ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాని అరణ్యకాండతో ప్రారంభించి యుద్ధకాండతో ముగించబోతున్నట్లు టీజర్, ట్రైలర్ స్పష్టం చేస్తున్నాయి కనుక అంతా యాక్షన్ సన్నివేశాలే ఎక్కువగా ఉండవచ్చు. కనుక అన్ని గంటల సేపు యాక్షన్ సన్నివేశాలను చూపిస్తూ ప్రేక్షకులను ఓం రౌత్ థియేటర్లలో కూర్చోబెట్టగలాడా?అనే ప్రశ్నకు జూన్ 16న సినిమా విడుదలైతే తెలుస్తుంది.
అయితే ఈ విమర్శలు, నెగెటివ్ ప్రచారం అన్నిటినీ తట్టుకొని ఒక్క దక్షిణాది రాష్ట్రాలలోనే ఆదిపురుష్ రూ.185 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇంకా ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల థియెట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ ద్వారా భారీ మొత్తం అందుకోబోతోంది.
దక్షిణాది హక్కులను సొంతం చేసుకొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నైజాం హక్కులను రూ.60 కోట్లు, ఆంధ్రా రూ. 70కోట్లు, సీడెడ్ రూ.25 కోట్లకు విక్రయించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మగా, బాలీవుడ్ నటుడు సైఫ్ఆలీ ఖాన్ రావణుడిగా, మరాఠీ స్టేజ్ ఆర్టిస్ట్ దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటించారు.
భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్లపై నిర్మించారు.