
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పూరి జనగణమన అంటూ ఓ పోస్టర్ వేశాడు. ఇజం ఫ్లాప్ తో స్టార్ హీరోలెవరు పూరితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు. నిన్న మొన్నటిదాకా తారక్ కూడా ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ సినిమా కూడా అటకెక్కినట్టే అంటున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు అసలు రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు అందుకే మహేష్ తో అనుకున్న జగణమన కథతో బాలకృష్ణ హీరోగా సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యాడు పూరి.
రీసెంట్ గా అమితాబ్ ను కలిసిన బాలయ్య చెవిన పూరి సినిమా గురించి వర్మ ద్వారా వినిపించాడట. త్వరలో పూరి మహేష్ కోసం రాసుకున్న కథ బాలకృష్ణతో చేయడం అనేది కాస్త షాకింగ్ న్యూసే. పూర్తిగా దేశభక్తితో నడిచే ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇజంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేస్తాడని అనిపించిన పూరి నిరాశ పరచాడు.
ఇప్పుడప్పుడే స్టార్ హీరోలెవరు పూరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అందుకే ఈలోగా ఇజం హింది రీమేక్ చేసి ఆ తర్వాత మళ్లీ తెలుగులో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. జనగణమన కథ మహేష్ కు నచ్చినా వరుస సినిమాలు ఉండటంతో సినిమా కోసం రెండేళ్లు వెయిట్ చేయమన్నట్టు టాక్. మరి బాలయ్యతో తీసే సినిమా జనగణమన అవునా కాదా అన్నది ఆ సినిమా న్యూస్ బయటకు వస్తేనే కాని చెప్పలేం.