
సినీ పరిశ్రమలో ఒకరినొకరు తొక్కేసుకొనేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఆపద్భాందవుడులా ఎవరో సాయపడితే ఇండస్ట్రీలో పైకి ఎదిగినవారూ ఉన్నారు. కానీ సాయంచేసినవారిని మరిచిపోయేవారే ఎక్కువ. కానీ దర్శకుడుగా రాణించాలనుకొని హీరోగా ఎదిగిన సిద్దార్ధ్ అటువంటివాడు కాదు.
ఆనాడు తనకు సాయం చేసిన సుజాత రంగరాజన్‌ని చూడగానే వేదిక మీద అందరూ చూస్తుండగానే ఆమెకు స్రాష్టాంగ నమస్కారం చేసాడు. తీవ్ర భావోద్వేగంతో ఏమీ మాట్లాడలేక ఆమెను ఆప్యాయంగా కౌగలించుకొని కన్నీళ్ళు పెట్టుకొంటుంటే, అది చూసి ప్రేక్షకులు కూడా భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకొన్నారు. తర్వాత హర్షధ్వనాలతో సిద్ధూని అభినందించారు.
టక్కర్ సినిమా ప్రమోషన్స్‌లో సిద్దార్ధ్ పాల్గొంటున్నప్పుడు ఇది జరిగింది. ఆ తర్వాత సిద్దార్ధ్ తేరుకొని ఆనాడు ఈమె నన్ను ప్రోత్సహించి, దర్శకుడు శంకర్‌తో మాట్లాడి బాయ్స్ సినిమాలో నటుడిగా అవకాశం ఇప్పించకపోయుంటే, ఈరోజు నేను మీ ముందు ఈవిదంగా నిలబడి ఉండేవాడినే కాను. నేను దర్శకుడిని అవుదామనుకొంటే, సుజాతగారు నేను సినిమాలలో నటించాలని పట్టుబట్టి ఒప్పించారు. శంకర్‌తో మాట్లాడి వేషం ఇప్పిస్తే నేను అయిష్టంగానే ఆడిషన్స్ కోసం స్టూడియోకి వెళ్ళాను. కానీ సుజాత గారికి నాపై ఉన్న నమ్మకం, ఆమె ఆశీర్వాదం వలన నన్ను ఆ సినిమాలో హీరోగా తీసుకొన్నారు. తర్వాత కధ అంతా మీ అందరికీ తెలిసిందే,” అని చెప్పాడు. భావోద్వేగం కలిగించే ఈ వీడియో మీ కోసం...