భోళాశంకర్‌ నుంచి చిరు లీక్స్... వీడియో

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న భోళాశంకర్‌ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈరోజు ఆ సినిమాలో ఓ పెళ్ళికి సంబందించి సంగీత్ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నారు. ఆ లొకేషన్ వీడియోని చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చిరు లీక్స్’ పేరుతో అభిమానులకు లీక్ చేశారు. ఆ వీడియోని ఎవరికీ తెలియకుండా షూట్ చేసి మీకోసం లీక్ చేస్తున్నానని కనుక మీరు కూడా ఎవరికీ తెలీకుండా చూసి ఆనందించాలని చిరంజీవి మెసేజ్‌ పెట్టడం ఆయన హాస్యచతురతకు అద్దం పడుతోంది. సెట్స్‌లో చిరంజీవి ఎంత సరదాగా ఉంటారో వీడియోని చూస్తే అర్దమవుతోంది.

ఈ సన్నివేశంలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేష్తో సహా సినిమాలో నటిస్తున్న నటీనటులందరూ ఉన్నారు. ఇదివరకు లీకయిన ఫోటోలను బట్టి ఈ సినిమాలో చిరంజీవి కోల్‌కతాలో టాక్సీ డ్రైవరుగా, తమన్నా లాయరుగా నటిస్తున్నట్లు స్పష్టమైంది. 

ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ అందిస్తున్నారు.