
తెలుగు సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడుగా ప్రవీణ్ సత్తారు మంచి పేరు సంపాదించుకొన్నాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమాకి ‘గాండీవధారి అర్జున’ గా పేరు ఖరారు చేశారు. ఇది కూడా పూర్తి యాక్షన్ సినిమాయే. ఈ సినిమా పేరు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడుని తలపించే విదంగా ఉన్నప్పటికీ దీనిని చాలా వరకు విదేశాలలోనే షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్లో ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ రాజు ఈ సినిమాకు మికీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకొంటున్న సంగతి తెలిసిందే. రేపు శుక్రవారం హైదరాబాద్‌లో వారి వివాహ నిశ్చితార్ధం జరుగబోతున్నట్లు తాజా సమాచారం. ‘మిస్టర్’ మూవీ చేసినప్పుడు వారిద్దరి మద్య ప్రేమ చిగురించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వారి ప్రేమ సక్సస్ కాబోతోంది. ఈ ఏడాది డిసెంబర్‌లోగా వారి వివాహం జరిగే అవకాశం ఉంది.