
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 108వ చిత్రం పేరు ‘భగవంత్ కేసరి’ అని ఖరారు చేశారు. దాని సబ్ టైటిల్ “ఐ డోంట్ కేర్..” అని పెట్టారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఇది బాలకృష్ణ 108వ చిత్రం గనుక రెండు తెలుగు రాష్ట్రాలలో 108 చోట్ల భారీ హోర్డింగ్స్ కూడా పెట్టారు.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమాగా అనిల్ రావిపూడి దీనిని తెరకెక్కిస్తున్నారు.
మరో విశేషమేమిటంటే ఈ సినిమా కధ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కనుక తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్ ఉంటాయి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు టైటిల్-పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ “గిప్పడి సంది ఖేల్ అలగ్” అంటూ తెలంగాణ యాసలో చిన్న హింట్ ఇవ్వగా, శ్రీలీల కూడా “అన్న దిగిండు ఇగ మాస్ ఊచకోత షురూ..” అంటూ మరో హింట్ ఇచ్చింది.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగకి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: అందిస్తున్నారు.
ఇది తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమా అయినప్పటికీ సబ్ టైటిల్ ‘ఐ డోంట్ కేర్' అని పెట్టడం చూస్తే దీనిలో బాలయ్య మార్క్ యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఫుల్లుగా ఉంటాయని అర్దమవుతోంది.