జూన్ 12 నుంచి గుంటూరు కారం సెకండ్ షెడ్యూల్

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా టీజర్‌కి మంచి స్పందనే వస్తోంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ ఈ నెల 12 నుంచి మొదలుపెట్టబోతున్నారు. దాదాపు 25 రోజులుపాటు సాగే ఈ షెడ్యూల్లో హీరోయిన్‌గా నటిస్తున్న శ్రీలీల పాల్గొనబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే కూడా నటిస్తోంది.   

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ గుంటూరు కారం తయారుచేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. 

మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ‘గుంటూరు కారం’ సిద్దం చేస్తున్నందున ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.