ఈ నెల 2,3 తేదీలలో శర్వానంద్, రక్షితా రెడ్డిల వివాహం రాజస్థాన్లోని జైపూర్ ప్యాలస్లోని లీలా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. వారి వివాహం సందర్భంగా యువనటుడు సిద్ధార్థ్, అదితీరావుల ప్రేమ వ్యవహారం బయటపడింది. వారిరువురూ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ వారు వాటిని కొట్టిపడేస్తున్నారు. అయితే శర్వానంద్ వివాహానికి వారిద్దరూ కలిసి జైపూర్ వెళుతున్నప్పుడు ముంబై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధుల కంటబడ్డారు.
పెళ్ళి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వారిద్దరూ కలిసి రాజస్థానీ నటి, రాజకీయవేత్త బినా కాక్ ఇంటికి వెళ్లినప్పుడు ఆమెతో వారిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిరువుని అంత సన్నిహితంగా చూసినవారు, ఇంకా దాగుడు మూతలెందుకు? హాయిగా శర్వాలాగా పెళ్ళి చేసుకోవచ్చు కదా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సిద్దార్థ్, అదితీరావు ఇద్దరి కెరీర్ అంత గొప్పగా ఏమీ లేదు. కనుక ఇక పెళ్ళి చేసేసుకొన్నా పర్వాలేదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
కార్తీక్ దర్శకత్వంలో సిద్దార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్ ఈ నెల 9న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సిద్ధూకి జోడీగా దివ్యాంశ్ కౌశిక్ నటించింది.