
పోలీస్ క్రైమ్ స్టోరీలతో వెబ్ సిరీస్‌లు చాలానే వచ్చాయి కానీ ఇంతవరకు సీరియల్ సినిమాలు రాలేదు. దర్శకుడు శైలేశ్ కొలను ‘హిట్ యూనివర్స్’ పేరుతో తెలుగు సినీ పరిశ్రమకి ఆ కొత్త ట్రెండ్ పరిచయం చేశారు. తొలుత హిట్: ది ఫస్ట్ కేస్ పేరుతో విశ్వక్ సేన్ హీరోగా తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత అడవి అడవి శేష్ని హీరోగా పెట్టి హిట్: ది సెకండ్ కేస్ తీయగా అది కూడా హిట్ అయ్యింది.
దాని తర్వాత నాచురల్ స్టార్ నానితో హిట్: ది ధర్డ్ కేస్ తీయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈలోగా వెంకీమామతో సైంధవ్ అనే సినిమా మొదలుపెట్టడంతో అది పూర్తికాగానే నానితో ఈ సిరీస్‌లో మూడో సినిమా మొదలుపెడతానని శైలేశ్ కొలను చెప్పారు. దాని తర్వాత నందమూరి బాలకృష్ణతో నాలుగో సినిమా తీయాలనుకొంటున్నట్లు చెప్పారు.
బాలకృష్ణకు ఆ కధ వినిపించానని కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు. మూడో సినిమా పూర్తయ్యేలోగా నందమూరి బాలకృష్ణ తప్పకుండా ఒకే చెపుతారనే నమ్మకం తనకి ఉందన్నారు. అది కూడా హిట్ సిరీస్‌లో సినిమాయే కానీ నందమూరి బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, స్టైల్‌కు తగ్గట్లుగా సినిమా కధ సిద్దం చేసుకొంటునట్లు శైలేశ్ కొలను చెప్పారు.
ఈవిదంగా హిట్సిరీస్‌లో సినిమా కొన్ని సినిమాలు చేసిన తర్వాత వాటన్నిటినీ, వాటిలో నటించిన హీరోలందరినీ కలుపుతూ చివరిగా మరో హిట్ సినిమా తీస్తానని దర్శకుడు శైలేశ్ కొలను చెప్పారు.