హైదరాబాద్‌లో ఒకే వేదికపై పాన్ ఇండియా స్టార్స్ ఎప్పుడంటే...

తెలుగు సినీ నటులు ఒకరిద్దరు ఒకచోట కనపడితేనే అభిమానుల ఉత్సాహం పట్టలేరు. అదే... ఓ అరడజను మంది ఒకే వేదికపై కనిపిస్తారంటే... అదీ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందిన ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేష్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, అలనాటి అందాల నటి జయప్రద, బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి వంటి వారందరూ ఒకే వేదికపై కనిపిస్తే?

ఈ అద్భుతమైన కలయిక రేపు (శనివారం) సాయంత్రం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరుగబోతోంది. 

ఎన్టీఆర్‌ లిటరేచర్, సావనీర్ & వెబ్‌సైట్‌ కమిటీ ఛైర్మన్‌ టిడి జనార్ధన్, నందమూరి అభిమానులు కలిసి రేపు సాయంత్రం ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జూ.ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. ఇప్పటికే ఖైతాలాపల్లి గ్రౌండ్స్‌లో ఈ వేడుకల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఆ ప్రాంతంలో అభిమానులు తమ ఆయా హీరోల ఫ్లెక్సీ బ్యానర్లు, కటవుట్లు ఏర్పాటు చేస్తున్నారు.