
కొరటాల శివ-జూ.ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తయారవుతున్న ఎన్టీఆర్
30వ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల
కాబోతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా నటిస్తున్న తెలుగు సినిమా ఇది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తోంది. ఈరోజు జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను
విడుదల చేయబోతున్నట్లు నిన్ననే
ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది.
మళ్ళీ ఇదే విషయం తెలియజేస్తూ నేడు మరో భయానకమైన పోస్టర్ విడుదల
చేసింది. సముద్రంలో తిరగబడిన ఓ నావ, ఓ పెద్ద ఖడ్గం, దాని వెనుక వ్రేలాడుతున్న మృతదేహాలను
చూపారు. “అతని కంటే ఎక్కువ భయపెట్టేది అతని కధే” అంటూ పక్కన ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈసారి
పోస్టర్‌లో ఈరోజు సాయంత్రం 7.02 గంటలకు ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు
ప్రకటించింది. అది విడుదలైతే ఈ సినిమా ఏవిదంగా ఉండబోతోందో మరి కొంత స్పష్టత రావచ్చు.
ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన మరో పోస్టర్...