పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్, రిలీజ్‌ డేట్ వచ్చేశాయి

సముద్రఖని దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రధానపాత్రలో చేస్తున్న సినిమాకు సంబందించి ఇవాళ్ళ ఒకేసారి రెండు అప్‌డేట్స్ వచ్చాయి. ఆ సినిమాకు ‘బ్రో’ టైటిల్‌ ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ కాలచక్రం (దేవుడు)గా నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సితం’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. తమిళంలో ఈ పాత్రను సముద్రఖని చేయగా, తెలుగులో ఆయన పవన్‌ కళ్యాణ్‌ని పెట్టి తీస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా జూలై 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మోషన్ పోస్టర్‌లోనే ప్రకటించడంతో పవన్‌ కళ్యాణ్‌ అభిమానూలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

ఈ సినిమాకు పవన్‌ కళ్యాణ్‌ ఆప్తమిత్రుడు, మాటల మాంత్రికుడు, త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు తీసుకోవడంతో ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్‌ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ తన పాత్రను చాలా రోజుల క్రితమే పూర్తిచేశారు. కనుక దర్శకుడు సముద్రఖని మిగిలినవారితో షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు. ఈరోజు మోసహ్ పోస్టర్‌ విడుదల చేసి రిలీజ్‌ డేట్ కూడా ప్రకటించడంతో, పవన్‌ కళ్యాణ్‌ నటించిన మిగిలిన సినిమాల కంటే ముందే ఇది విడుదల కాబోతున్నట్లు స్పష్టమవుతోంది.