ఒక్క ఫైట్ 30 కోట్లట..!

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏంటో ఊహలకే అందదు కావొచ్చు. ప్రాంతీయ సినిమాతో దేశంలోనే కాదు కాదు ప్రపంచంలోనే తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిన బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం బాహుబలి -2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన ప్రభాస్ ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు సైన్ చేస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమా హిట్ కొట్టి సెకండ్ మూవీనే ప్రభాస్ తో తీసేలా ప్లాన్ చేస్తున్నాడు సుజిత్.

అంతేకాదు ప్రభాస్ కోసం ఏకంగా రెండేళ్ల నుండి సినిమా చేయకుండా ఉన్నాడు కూడా. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ముందు ఎంత అనుకున్నారో ఏమో కాని ప్రభాస్ రేంజ్ మారిపోయింది కాబట్టి 150 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఒక ఫైట్ ఏకంగా 30 కోట్ల ఖర్చుతో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఆకాశంలో ఉండే ఈ సీక్వెన్స్ కోసం 30 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు.

హీరో ప్రభాస్ కాబట్టి ఎంత పెట్టినా తక్కువే అని యువి వారి ఆలోచన. మొన్నటిదాకా చిన్న బడ్జెట్ సినిమాలతో సేఫ్ గేం ఆడిన యువి క్రియేషన్ ఇప్పుడు ప్రభాస్ తో ఏకంగా భారీ బడ్జెట్ తో రిస్క్ తీసుకుంటున్నారు. మరి ఈ సినిమా అవుట్ పుట్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.