
సూర్య అండతో తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు సూర్య తమ్ముడు కార్తి. ఇద్దరు కలిసి పనిచేయకపోయినా తమ్ముడి సినిమాకు కావాల్సిన అండదండలు అందిస్తుంటాడు. అందుకే ఈ దీవాళికి రావాల్సిన సూర్య ఎస్-3 ని కాష్మోరా కోసం పోస్ట్ పోన్ చేశాడు. మరో రెండు రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న కాష్మోరా సినిమా ప్రమోషన్స్ లో ఆ సినిమా హీరో కార్తి తన సినిమా కన్నా బాహుబలి గురించి మాట్లాడటం ఎక్కువైంది.
విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా వస్తున్న ఈ కాష్మోరాను బాహుబలితో పోల్చి చూడవద్దు అని కార్తి నెత్తి నోరు పెట్టుకుని చెబుతున్నాడు. ఓ రకంగా బాహుబలి భయం వల్లే కార్తి ఇలా ప్రచారం చేస్తున్న టాక్ వస్తుంది. సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించిన కార్తి సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. తన చేతికి మైక్ వస్తే మాత్రం బాహుబలి పేరు తలచుకోకుండా ఉండట్లేదు కార్తి. అంతేకాదు బాహుబలి చూశాకా రెండు నెలలు షూటింగ్ ఆపి మరి సినిమా చేశామని అన్నాడు. ఓ రకంగా కార్తికి బాహుబలి భయం పట్టుకుందేమో అని అంటున్నారు సిని జనాలు.
గోకుల్ డైరెక్ట్ చేసిన కాష్మోరా సినిమా పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మించారు. నయనతార, శ్రీ దివ్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా దీవాళి కానుకగా రిలీజ్ అవుతుంది.