కోలీవుడ్‌లో విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేసే నటులలో ధనుష్ ఒకరు. అతని తాజా సినిమా పేరు కెప్టెన్ మిల్లర్. 1930-40 మద్య కాలంలో ఈ సినిమా కధ సాగుతుంది. ఈ సినిమాలో ధనుష్‌కి జంటగా ప్రియాంకా అరుల్ మోహన్, నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, వినోద్ కిషన్, జాన్ కొక్కెన్, మూరు, ఎడ్వర్డ్ సోనేన్ బ్లిక్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్-లుక్‌ను జూన్‌లో, టీజర్ జూలైలో విడుదల చేస్తామని సినిమా నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
21 సంవత్సరాల ధనుష్ సినీ కెరీర్లో తొలిసారిగా చాలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెలుగు, తమిళ్,హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సిద్ధార్థ్ నుని, కొరియోగ్రఫీ: దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.