
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్న హాస్యనటుడు పృధ్వీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన తన కుమార్తె ‘శ్రీలు’ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమా చేస్తున్నారు. దానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి ప్రమోషన్స్‌లో పాల్గొంటుండగా పృధ్వీ హటాత్తుగా కుప్పకూలిపోయారు. అయితే పని ఒత్తిడి, నీరసించి పడిపోయారని, రెండుమూడు రోజులు విశ్రాంతి తీసుకొంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఆయన హాస్పిటల్ బెడ్ ఉండగానే మీడియాతో మాట్లాడుతూ, “నేను సిలైన్ ఎక్కించుకొంటూ ఇక్కడ బెడ్ మీద ఉన్నప్పటికీ నా సినిమా గురించే ఆలోచిస్తున్నాను. తొలిసారిగా నా కూతురు శ్రీలు నటించిన సినిమాకి నేను దర్శకత్వం వహించాను. మా టీమ్‌కి మీ అందరి ఆశీర్వాదం కావాలీ,” అని అన్నారు.
ఈ సినిమాలో శ్రీలుకి జంటగా పృధ్వీ స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా నటించాడు. తన కూతురు శ్రీలు హోటల్‌లో మేనేజిమెంట్ డిగ్రీ పూర్తి చేసిందని, మలేషియా వెళ్ళి స్థిరపదాలని అనుకొంది కానీ డ్యాన్స్, సినిమాల మీద మోజుతో తన కెరీర్‌ను పక్కనపెట్టి సినీ రంగంలోకి వస్తోందని పృధ్వీ చెప్పారు. ఈ సినిమాలో పృధ్వీరాజ్, విజయరంగరాజు, అశోక్ కుమార్, గీతా సింగ్, కృష్ణతేజ, అంబటి శ్రీను, జబర్దస్ట్ నటులు నవీన్, గణపతి తదితరులు నటించారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే పృధ్వీ, సంగీతం: సంగీత్ ఆదిత్య, కెమెరా: ఎస్వీ శివారెడ్డి, ఎడిటింగ్: రామకృష్ణ అర్రం చేశారు. పద్మరేఖ, గుంతక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి కలిసి ఈ సినిమాను శ్రీపిఆర్ క్రియెషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతోంది.