అమెజాన్ ప్రైమ్‌లోకి శాకుంతలం... మే 12న

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ శకుంతల దుష్యంతులుగా నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల అందరినీ తీవ్ర నిరాశపరిచింది. ప్రేమకధలను అద్భుతంగా తెరకెక్కించడంలో పేరుగాంచిన గుణశేఖర్ ఈసినిమాలో శకుంతల దుష్యంతులు ప్రేమకావ్యాన్ని సరిగ్గా మలచడంలో విఫలమయ్యారు. కనుక ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్‌ల మద్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు. సినిమా కధ, నటీనటులు, టెక్నీషియన్స్ పనితనంలో ఎటువంటి లోపంలేనప్పటికీ సినిమా దారుణంగా ఫెయిల్ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమంత దీంతో ఓ మంచి హిట్ కొట్టి పౌరాణిక పాత్రలలో కూడా తనకు సాటిలేదని నిరూపించుకొందామనుకొంటే, సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాపై అమెజాన్ సంస్థ కూడా భారీ అంచనాలు పెట్టుకొని రూ.20 కోట్లు చెల్లించి దీని ప్రసార హక్కులను కొనుకొంది. కనుక ఆ సంస్థ కూడా నష్టపోయింది. ఈ సినిమా మే 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయబోతోంది. 

ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ఈ సినిమాలో చిన్నారి భరతుడిగా (శకుంతల, దుష్యంతుల కుమారుడు) నటించి మెప్పించింది.