బాలకృష్ణలో ఇంత టాలెంట్ ఉందా?అలవోకగా పాడేశారుగా!

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఆయన ప్రసంగాలపై నేటికీ జోకులు పేలుతూనే ఉంటాయి. వేదికపై తడబడకుండా నాలుగు ముక్కలు మాట్లాడలేని బాలకృష్ణ సినిమాలలో అంత పెద్ద డైలాగులు అలవోకగా ఎలా చెపుతారో?అని జనాలు అనుకోవడం సహజమే. అయితే వేదికపై ప్రసంగించడానికి తడబడే బాలయ్య తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ నటించిన ఎవ్వర్ గ్రీన్ క్లాసిక్ ‘జగదేకవీరుని కధ’ చిత్రంలోని అత్యంత సంక్లిష్టమైన ‘శివశంకరి... శివానందలహరి...’ పాటను వేదికపై అలవోకగా పాడారు. 

ఖతార్ దేశ రాజధాని దోహాలోతెలుగువారు  శుక్రవారం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహించగా దానిలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నందమూరి బాలకృష్ణ శివశంకరి పాటను అత్యద్భుతంగా పాడి అందరినీ అలరించారు. ఆయన ఆ పాట పాడుతుంటే, ఎక్కడ తడబడతారో అని అందరూ ఊపిరిబిగపట్టి మరీ చూశారు. కానీ ఆయన అలవోకగా స్వరాలను, రాగాలను ఆలపిస్తూ పాటపూర్తిచేసేసరికి ఆడిటోరియంలో అభిమానులందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో హర్షధ్వానాలు చేశారు. నందమూరి బాలకృష్ణ పాడిన ఈ పాటను మీరు విని ఆనందించండి...