
విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఖుషీ అయ్యే ఓ కబురు... ఏమిటంటే ఈ నెల 9వ తేదీన వారిద్దరూ కలిసి నటిస్తున్న ఖుషీ సినిమాలో ‘నా రోజా నువ్వే... అంటూ సాగే తొలిపాటని విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో ప్రకటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ విషయం తెలియజేస్తూ విజయ్ దేవరకొండ, సమంతల ఫోటోని కూడా విడుదల చేసింది.
పూరీ జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ, గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో సమంత ఇద్దరూ గట్టి ఎదురుదెబ్బలు తిన్నారు. కనుక ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవడం చాలా అవసరం.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా మురళి జి, సంగీతం హషమ్ అబ్దుల్ వాహేబ్ అందిస్తున్నారు. క్రిస్‌మస్ పండుగ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.