పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఒకేరోజు రెండు కానుకలు

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఇవాళ్ళ ఒకేసారి రెండు కానుకలు లభించాయి. ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా నుంచి కాగా, మరొకటి హరీష్ శంకర్‌  దర్శకత్వంలో సిద్దమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా నుంచి. 

ముందుగా హరీష్ శంకర్‌-పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్‌ నుంచి ఈ నెల 11న పవర్‌ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ రెడ్ అండ్ బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌తో పోలీస్ యూనిఫారంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్రాన్ని విడుదల చేశారు. 39 సెకన్లు నిడివి కలిగిన ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం ఎడిటింగ్ జరుపుకొంటోందని తెలియజేశారు. 


ఇక ఓజీ సినిమా నుంచి కూడా ఇదే ‘వాల్ పేపర్ మెటీరీయల్’ అంటూ నీలం రంగు టీషర్ట్, గాగుల్స్ ధరించిన పవన్‌ కళ్యాణ్‌ ఫోటోని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విడుదల చేసింది. ముంబైలో షూటింగ్‌ షెడ్యూల్ పూర్తయిపోయిందని తర్వాత పూణేలో షూటింగ్‌ మొదలుపెట్టామని తెలియజేసింది. 


అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా అభిమానులు డిజైన్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టర్స్ చూస్తుంటే అవి సినిమా సంస్థలు పెడుతున్న పోస్టర్లకు తీసిపోన్నట్లుగా అద్భుతంగా ఉన్నాయి. వాటిని చూసినప్పుడు అభిమానులలో ఇంత ట్యాలెంట్, పవన్‌ కళ్యాణ్‌ పట్ల ఇంత అభిమానం ఉందా? అని ఆశ్చర్యం కలుగకమానదు.