ఎన్టీఆర్‌-కొరటాల సినిమాలో చైత్రరాయ్

ఎన్టీఆర్‌-కొరటాల సినిమాలో తొలిసారిగా ప్రముఖ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చైత్ర రాయ్‌కి అవకాశం లభించింది. ఆమెకు ఇదే తొలి సినిమా ఛాన్స్ కూడా. తొలి సినిమాలోనే ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం లభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటీవల తొలిసారిగా సినిమా సెట్స్‌లో అడుగుపెట్టినప్పుడు ఎన్టీఆర్‌, సైఫ్ ఆలీఖాన్, జాన్వీ కపూర్‌ వంటి స్టార్లను చూసి చాలా ఆనందంతో పొంగిపోయానని చెప్పారు. ఈ సినిమాలో తాను విలన్‌గా నటిస్తున్న సైఫ్ ఆలీఖాన్‌కు భార్యగా నటిస్తున్నానని చైత్రారాయ్ తెలిపారు. ఆమె అష్టాచెమ్మా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు, దటీజ్ మహాలక్ష్మీ, తాజాగా రాధకు నీవేరా ప్రాణం డైలీ సీరియల్స్ లో నటిస్తున్నారు.

ఎన్టీఆర్30 ప్రొడక్షన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు కెమెరా రత్నవేలు, సంగీతం అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్.