అఖిల్... అప్పుడే మొదలుపెట్టేస్తున్నాడే!

ఒక సినిమా ఫెయిల్ అవడానికి సినిమాపరంగా అనేక కారణాలు ఉంటాయి. ఇవికాక ఇండస్ట్రీలో పోటీ, ఆ కారణంగా కుట్రలు, ఇంకా సినిమా రివ్యూలతో చంపేయడం వంటి చాలా కారణాలే ఉంటాయి. కారణాలేవైతేనేమి అఖిల్ అక్కినేని నటించిన ఏజంట్‌ ఫ్లాప్ అయ్యింది. అత్త కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాన్నట్లు సినిమా ఫ్లాప్ అయినందుకు కాదు... ఆ పేరుతో ట్రోలింగ్ చేస్తున్నందుకే అఖిల్ ఎక్కువ బాధపడుతున్నాడు. ఏ రంగంలోనైనా ఇలాంటి ఒడిదుకులు తప్పవు కనుక అఖిల్ దీని తర్వాత సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. కొత్త దర్శకుడు అనిల్‌తో యూవీ క్రియెషన్స్ సంస్థ ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ సినిమా కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తొలిసారిగా జూ.ఎన్టీఆర్‌తో కలిసి తెలుగులో నటిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది కనుక ఆమె అఖిల్‌కు హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకొంటుందా లేక అఖిల్ ట్రాక్ రికార్డ్ చూసి ‘నో’ చెపుతుందా? చూడాలి.