మరో జాతిరత్నం... మన పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రలలో వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టీజర్‌ విడుదలైంది. టైటిల్‌తోనే ఇదో స్టాండప్ కామెడీ సినిమా అని స్పష్టమైంది. టీజర్‌ అదే చెపుతోంది. మహేష్ బాపు దర్శకత్వంలో యూవీ క్రియెషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో అనుష్క లండన్‌లో ఓ పెద్ద స్టార్ హోటల్‌లో చెఫ్‌గా నటిస్తుండగా, నవీన్ పోలిశెట్టి స్టాండప్ సిద్ధూ అనే కమెడియన్‌గా నటిస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి అంటేనే కామెడీ మళ్ళీ సిట్యువేషన్‌కి సంబందం లేకుండా కామెడీ చేస్తానంటూ స్టాండప్ కామెడీ చేస్తే ఈ సినిమాలో కామెడీ ఏ రేంజ్‌లో ఉంటుందో?    

ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అనుష్కకి ఇది 48వ సినిమా. అరుంధతి, భాగమతి, రుద్రమదేవి వంటి అనేక హీరోయిన్‌ ఓరియంటడ్ సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ నవీన్ పోలిశెట్టితో కలిసి నటించడం విశేషమే.  

ఈ సినిమాకు సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ అమిత్‌ షా అందిస్తున్నారు. 

వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. త్వరలోనే మిస్టర్ అండ్ మిస్ పోలిశెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.