అరవింద సమేతలో కంటే ఇంకా భయంకరంగా కనిపిస్తాను

మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అరవింద సమేత సినిమాలో నాకోసం త్రివిక్రం శ్రీనివాస్‌ నన్ను దృష్టిలో ఉంచుకొని బసిరెడ్డి అనే ఫ్యాక్షనిస్ట్ పాత్రను సృష్టించారు. పగ, ప్రతీకారం కోసం కన్న కొడుకును కూడా చంపుకొనే పాత్ర అది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో నా పాత్ర గురించి చర్చించుకొన్నప్పుడు బసిరెడ్డి పాత్ర కంటే చాలా భిన్నంగా, ఇంకా భయంకరంగా ఉంటుందని అర్దమైంది. అరవింద సమేతలోనే దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్‌ నన్ను పూర్తిగా పిండేసి బసిరెడ్డిని బయటకు తీశాడు. ఈ సినిమాలో ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని అర్దమవుతోంది. కనుక నేను విలన్‌గా చేసినా ప్రేక్షకులకు నా పాత్ర, నా నటన తప్పక నచ్చుటయనే అనుకొంటాను,” అని జగపతిబాబు అన్నారు.   

ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటిస్తున్నారు. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.