
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్న సినిమా భోళాశంకర్ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంటర్వెల్ ముందు వచ్చే ఓ ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశంలో చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోనందున ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే మరోపక్క డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. నేటి నుంచే డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. జూన్ రెండోవారంలో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
ఈ సినిమా కూడా వాల్తేర్ వీరయ్యలాగే మాస్ ఎంటర్టైనర్ సినిమా. కనుక దీనిలో కూడా చిరంజీవి డ్యాన్సులు, డైలాగులు, కామెడీ, ఫైట్స్ అన్నీ పుష్కలంగా ఉండబోతున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ.