
గోపీచంద్, డింపుల్ హయతి జోడీగా చేస్తున్న ‘రామబాణం’ మే 5న విడుదల కాబోతోంది. దీని సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. దర్శకుడు శ్రీవాస్ ఈవిషయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ తన మనసులో భావాలను పంచుకొన్నారు.
“ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమా సెన్సార్‌కి వెళ్లినప్పుడు ఏమైనా కట్స్ చెప్తారా? అని ప్రతి మూవీకి ఎంతోకొంత టెన్షన్ ఉంటుంది. కానీ నాకు రామబాణం విషయంలో ఆ టెన్షన్ కొంచం తక్కువే ఉంది.. ఈరోజు మా రామబాణం మూవీని సెన్సార్ ఆఫీనర్ అండ్ టీమ్ చూశాక నన్ను, మా కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని లోపలికి పిలిచి, ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారు... మేము ఎంత వెతికినా ఒక్క ఆడియో కట్ కానీ.. వీడియో కట్ కానీ మాకు దొరకలేదు... అని మమ్మల్ని అభినందించి, కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తున్నాం అని చెప్పి పంపించారు. థాంక్స్ టూ సెన్సార్ టీమ్.. మే 5న మా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా ఇలాన్ ఫీల్ అయ్యి మా రామబాణం మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తునన్నారు.
రామబాణం సినిమాలో జగపతి బాబు, ఖుష్బు, నాజర్, అలీ, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, రాజా రవీంద్ర, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
ఈ సినిమాకు భూపతి రాజా కధ అందించగా, మధుసూధన్ పద్మావతి డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రామబాణం సినిమాకి కెమెరా: వెట్రీ పళనిస్వామి, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, దినేష్ కుమార్, రఘు, యాక్షన్: కనాల్ కణ్ణన్, రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, శ్రీమణి, కళ్యాణ చక్రవర్తి అందించారు.