నాచురల్ స్టార్ నాని, మాహానటి కీర్తిసురేష్ జంటగా నటించిన దసరా సినిమా మార్చి 30వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నాని కెరీర్‌లో తొలిసారిగా రూ.65 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళ, హిందీ భాషల్లో సినిమా తీసి విడుదల చేస్తే నాలుగు వారాలలోనే రూ.100 కోట్లు కలక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ప్రసారం అవుతోంది. హిందీ తప్ప మిగిలిన అన్ని భాషలలో నేటి నుంచి ప్రసారం అవుతోంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపద్యంతో తెరకెక్కించిన ఈ సినిమాలో చాలావరకు పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలోని ఓ పల్లెటూరులో షూట్ చేశారు. నాని తదితరులు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ చాలా ఆకట్టుకొన్నాయి. ఈ సినిమా సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.