
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జోడీగా చేస్తున్న రామబాణం చిత్రంలో మూడో పాట నేడు విడుదలైంది. నువ్వే నువ్వే నువ్వే.. పూల గుత్తిలా కనిపిస్తావే..’’ అంటూ సాగిన ఈ పాటను శ్రీమణి రచించగా మిక్కీ జె మేయర్ స్వరపరిచారు. రితేష్ జి రావు చాలా హృద్యంగా ఆలపించారు.
మే 5వ తేదీన విడుదల కాబోతున్న రామబాణం సినిమాలో జగపతి బాబు, ఖుష్బు, నాజర్, అలీ, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, రాజా రవీంద్ర, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.
ఈ సినిమాకు భూపతి రాజా కధ అందించగా, మధుసూధన్ పద్మావతి డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రామబాణం సినిమాకి కెమెరా: వెట్రీ పళనిస్వామి, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, దినేష్ కుమార్, రఘు, యాక్షన్: కనాల్ కణ్ణన్, రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, శ్రీమణి, కళ్యాణ చక్రవర్తి అందించారు.