
సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం పేరు మామా మశ్చీంద్రా. హర్షవర్ధన్ దర్శకత్వంలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదల చేశారు. టీజర్లో యాక్షన్, కామెడీ, రొమాన్స్ సన్నివేశాలు చూస్తే సుధీర్ బాబు మామా మశ్చీంద్రాతో ఏదో మాయచేయబోతున్నట్లు ఉన్నాడు. టీజర్ ‘కటౌట్ చూస్తేనే కేలరీలు బర్న్ అయిపోయేలా ఉన్నాడే... గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉంటే ఎవడైనా రాముడే...’ వంటి డైలాగ్స్ చాలా ఆకట్టుకొంటున్నాయి.
ఈ సినిమాలో హర్షవర్ధన్, ఆలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్యపాత్రలు చేశారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పి రామ్మోహనరావు నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేస్ఝ్, కొరియోగ్రఫీ: భాను మాస్టర్, స్టంట్స్: వింగ్‌చున్ అంజి చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.