కొడైకెనాల్‌లో దేవ్ మోహన్‌తో రష్మిక రొమాన్స్!

అవును నిజమే... కొడైకెనాల్‌లో దేవ్ మోహన్‌తో రష్మిక మందన రొమాన్స్ చేస్తోంది. అయితే నిజజీవితంలో కాదు రెయిన్ బో సినిమా కోసం. నూతన దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా సమంతను తీసుకోవాలనుకొన్నారు. కానీ ఆమె మయొసైటీస్ వ్యాధికి గురవడం, ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోవడంతో ఆమె స్థానంలో పుష్ప సినిమాతో దేశమంతా పేరు మారుమ్రోగిపోతున్న రష్మిక మందనను తీసుకొన్నారు. 

మరో విశేషమేమిటంటే రెయిన్‌బో హీరోయిన్‌ ఓరియంటెడ్ మూవీగా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కనుక ఈ సినిమా పూర్తి బాధ్యత రష్మిక మందన భుజాలపైనే ఉంటుంది. ఈ నెల 3న ఈ సినిమాలో పూజా కార్యక్రమాలు జరుపుకొన్న తర్వాత కొన్నిరోజులు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం కొడైకెనాల్ చేరుకొన్నారు. అక్కడ 15 రోజులు షూటింగ్‌ చేయవచ్చని సమాచారం. 

ఈ సినిమాకు ఫోటోగ్రఫీ: కెఎం భాస్కరన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నారు.