శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తిసురేష్ జంటగా వచ్చిన దసరా సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు నుంచే వసూళ్ళలో దూసుకుపోటూ వంద కోట్లు రాబట్టింది. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నెలరోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకోవాలని నిర్మాతల మండలి ఒప్పందం చేసుకొన్నప్పటికీ, కొంత మంది ఇంకా ముందుగానే విడుదల చేసుకొంటున్నారు. కనుక దసరా సినిమా మూడు రోజులు ముందుగా అంటే ఈ నెల 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది.
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులు ఉండే వీర్లపల్లి గ్రామంలో నివసించే ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్)ల జీవితాలను ఉపసర్పంచ్ ఎన్నికలు ఏవిదంగా ప్రభావితం చేశాయనేది ఈ సినిమా కధాంశం. ముగ్గురూ పోటీపడి నటించి మెప్పించారు. కధాంశం, కధనం, కెమెరా, సంగీతం, భావోద్వేగాలు అన్ని చాలా చక్కగా కుదరడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తోంది కనుక వారు కూడా చూసి ఆనందించవచ్చు.