ప్రభాస్‌ సలార్ సినిమా ఒకటి కాదు... రెండట!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌ సలార్ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్న కన్నడ నటుడు దేవరాజ్, ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సలార్ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నట్లు చెప్పారు. అయితే హోంభలే ఫిలిమ్స్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాలో ప్రభాస్‌ డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒక పాత్ర పేరు దేవ. అది పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్ర అని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సినిమాలో కన్నడ నటుడు యష్ను నెగెటివ్ షెడ్‌లోనే చూపినా సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్‌ కూడా ఇదివరకు బిల్లా సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. కనుక సలార్‌లో ప్రభాస్ నెగెటివ్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా, శ్రుతిహాసన్ నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి, పృధ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. సలార్ 2023, సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. 

సలార్ సినిమా బ్యానర్‌: హోంభలే ఫిల్మ్స్, నిర్మాత: విజయ్ కిరంగదుర్, సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ, సంగీతం: రవి బస్‌రూర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.   

ఇది కాక ప్రభాస్‌ ఆదిపురుష్‌, రాజా డీలక్స్, ప్రాజెక్ట్-కె, స్పిరిట్ సినిమాలను సిద్దం చేస్తున్నాడు. వీటి మద్యలో ప్రభాస్‌ మరో పౌరాణిక సినిమా చేయబోతున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పారు.