గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇన్నేళ్ళకు కలిసి చేస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తిరుగుతుండటంతో ఆలస్యమైంది. అయితే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే హరీష్ శంకర్ చకచకా 8 రోజులలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. మొదటి షెడ్యూల్లోనే హీరోయిన్ శ్రీలీలాతో కొన్ని రొమాంటిక్ సీన్స్, స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ డైరెక్షన్లో ఏకంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని స్టంట్స్ సీన్స్ షూట్ చేశారు. ఇవి కాక చిన్న పిల్లలతో కొన్ని కామెడీ సీన్స్ కూడా షూట్ చేశారు.
మొదటి షెడ్యూలో పవన్ కళ్యాణ్, శ్రీలీల, చమ్మక్ చంద్ర, టెంపర్ వంశీ, నర్రా శ్రీను, కేజీఎఫ్-అవినాష్, గిరి, నవాబ్ షా తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అయనంకా బోస్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడితో హరిహరవీరమల్లు, సముద్రఖనితో మరో సినిమా పూర్తిచేశారు. ఇప్పుడు హరీష్ శంకర్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సుజీత్‌తో మరో సినిమా చేసేందుకు ఒప్పుకొన్నారు.