ఎన్టీఆర్-కొరటాల శివల కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ చిత్రంలో అలనాటి అందాలనటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఓ మత్స్యకారుడి కుమార్తెగా నటించబోతోంది. లంగా, ఓణీతో ఆమె ఫస్ట్-లుక్ అదే చెపుతోంది. అయితే బయట ఆమె స్టైలే వేరు. ఎప్పుడూ కురచ దుస్తులు ధరిస్తూ, అందాలు ఆరబోస్తుంటుంది. ఇప్పుడు ఆమె ఎన్టీఆర్కు జోడీగా నటిస్తుండటంతో ఆమె తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా కుర్రకారుని ఎన్టీఆర్ అభిమానులతో బాగా కనెక్ట్ అయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అంటే ఆమె సోషల్ మీడియాలో వారందరితో టచ్చులో ఉందని కాదు. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. వాటిని చూసి కుర్రకారు ఆమెను ఫాలో అవుతూ, కామెంట్స్ పెడుతూ లైక్స్ కొడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు. తమ హీరోకి తగిన జోడీ దొరికిందని అనుకొంటున్నారు. ఈ హాట్ ఫోటోస్ చూస్తే మీరూ ఒప్పుకొంటారు.
ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.