.jpg)
ఎన్నో చక్కటి సూపర్ హిట్ సినిమాలు అందించిన విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రం ‘సైంధవ్’ను ప్రారంభించారు. ‘హిట్’ సిరీస్ సినిమాలను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్న శైలేశ్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం చేస్తుండటంతో, సైంధవ్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించామని చిత్రబృందం తెలియజేసింది. తర్వాత ఓ పాట చిత్రీకరించబోతున్నట్లు తెలిపింది. ఈ సినిమాతో శ్రీనిధి శెట్టిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ కూడా టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు.
ఇప్పటికే విడుదలైన సైంధవ్ ఫస్ట్-లుక్ పోస్టర్ను వగైరాలు చాలా ఆకట్టుకొంటున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్ అందిస్తున్నారు. ఇప్పటికే రానా నాయుడుతో వెంకటేష్ ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయినందున సైంధవ్ను పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన సైంధవ్ విడుదలకాబోతోంది.