శాకుంతలం షూటింగ్‌లో వాటితో చాలా ఇబ్బంది పడ్డా

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన శాకుంతలం ఈ నెల 14నా విడుదల కాబోతోంది. కనుక సమంత మళ్ళీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమె తాజా ఇంటర్వ్యూలో శాకుంతలం సినిమా షూటింగ్‌కు సంబందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

ఈ సినిమాలో నేను దాదాపు 30 కేజీల బరువున్న లంగా ధరించి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు గుండ్రంగా తిరిగే సన్నివేశంలో నేను కెమెరా ఫోకస్ ఏరియా నుంచి బయటకు వెళ్ళిపోతుండేదానిని. అప్పుడు డైరెక్టర్ గుణశేఖర్ నామీద కోప్పడ్డారు కూడా. కానీ నేనేమి చేయగలను? నేను గిర్రున తిరిగినప్పుడు ఆ లంగా బరువుకి పక్కకు లాగేస్తున్నట్లయ్యేది. ఆ సీన్ ఒకే చేయడానికి 10-11సార్లు చేయాల్సివచ్చింది. చివరికి ఒకే చేశారు,” అని సమంత చెప్పింది. 

శాకుంతలం సినిమా కోసం నేను మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. అప్పుడు మిగిలిన నటీనటులు కూడా ఇన్ని భాషలలో తమపాత్రలకి ఏవిదంగా డబ్బింగ్ చెపుకొంటారా?అని అనుకొనేదానిని. 

“నాకు కొన్ని రకాల పూలు పడవు. వాటితో స్కిన్ అలర్జీ వస్తుంది. కానీ శాకుంతలం సినిమా షూటింగ్‌లో ప్రతీరోజూ వాటినే నా రెండు చేతులకు చుట్టేవారు. షూటింగ్‌ అయిపోయిన తర్వాత ఆ పూలు చుట్టిన చోట ర్యాషస్ వచ్చేవి. కానీ వాటిని మేకప్‌తో కవర్ చేసేసి మళ్ళీమళ్ళీ అవే పూలతో షూటింగ్‌లో పాల్గొనే దానిని. సినిమా పూర్తయ్యేవరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. వాటి అలర్జీ నుంచి పూర్తిగా కోలుకోవడాని నాకు దాదాపు 5-6 నెలలు పట్టింది,” అని సమంత చెప్పింది.