
‘జాంబి రెడ్డి’ సినిమాతో తెలుగులో సరికొత్త కధాంశంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు యువనటుడు తేజ సజ్జాతో ‘హనుమాన్’ అనే మరో సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమాలో తేజసజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్‌భవన్ దీపక్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ముందే ప్రకటించిన్నట్లు హనుమాన్ చాలీసా గ్రాఫిక్ వీడియో విడుదల చేశారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు, చైనీస్, కొరియన్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా నిర్మిస్తుండటం గమనిస్తే దర్శక నిర్మాతలు తమ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్దం అవుతోంది.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, సంగీతం: గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సురభి, కెమెరా: దాశరధి శివేంద్ర, ఎడిటింగ్: ఎస్‌బి రాజు తలారి. హనుమాన్ సినిమా మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.