శాకుంతలం రిలీజ్‌ ట్రైలర్‌ గ్రాఫిక్స్ ఓకే కానీ భాష...

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతల,దుష్యంతుల పౌరాణిక ప్రేమగాధ శాకుంతలం ఈ నెల 17న విడుదల కాబోతోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్‌ దుష్యంత మహారాజుగా నటించగా, కన్వముని కుమార్తె శకుంతలగా సమంత నటించింది. వారి పుత్రుడు చిన్నారి భరత్‌గా అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

శాకుంతలం రిలీజ్‌ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్‌ వేగం పెంచి బుదవారం రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. దానిలో అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఎవరో ఫారినర్ తెలుగులో మాట్లాడిన్నట్లు కాస్త ఎబ్బెట్టుగా ఉంది. గుణశేఖర్ డబ్బింగ్ విషయంలో మరికాస్త శ్రద్దపెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది. తెలుగులో డైలాగ్స్ ఇలా ఉంటే, ఇక మిగిలిన భాషలలో ఎలా ఉంటాయో?       

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.