ఇప్పుడు నన్ను ఆంటీ అన్నా ఓకే: అనసూయ

యాంకర్ నుంచి ఫుల్ టైమ్ సినిమా యాక్టర్‌గా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొన్న వ్యక్తి అనసూయ. మంచి నటిగా పేరు సంపాదించుకొన్నప్పటికీ, సోషల్ మీడియాలో అందరి కంటే ఎక్కువగా ట్రోలింగ్ అవుతుంటారు ఆమె. దానికి కారణాలు అందరికీ తెలిసినవే కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. అయితే ఈ ఆంటీ వ్యవహారం గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం మరోసారి ఆమెలో ఆంటీని అందరూ గుర్తించేలా చేసిందని చెప్పవచ్చు. 

ఇంతకీ ఆ ప్రశ్న, దానికి ఆమె జవాబు ఏమిటంటే, “అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే ఎందుకు అంత కోప్పడతారు?” అని అడగగా, “నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళ పిలుపులకు అర్ధాలు వేరే ఉంటాయి. అందుకే వారిపై కోప్పడుతుంటాను. కానీ ఇప్పుడు నన్ను ఆంటీ అని పిలిచినా కోపం రావట్లేదు. ఎందుకంటే అలాంటివాళ్ళని ఎదుర్కొంటూ కూర్చోలేను. నాకు అంతకంటే చాలా ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేశాను,” అని అనసూయ చెప్పారు.